Home / Tag Archives: Cricket (page 72)

Tag Archives: Cricket

శిఖర్‌ ధావన్‌ అర్ధశతకం

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (51; 64 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం బాదాడు. తొలి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన అతడు ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీ ఔట్‌ కావడంతో సమయోచితంగా బౌలింగ్‌ను ఎదుర్కుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడడం లేదు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 114/2తో ఉంది. దినేశ్‌ కార్తీక్‌ (16; 26 బంతుల్లో 1×4) …

Read More »

రెండో వన్డేలో..బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

పిచ్‌ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో అక్సర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామం కావడంతో కివీస్‌ జట్టు కెప్టెన్‌ …

Read More »

ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?

పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్‌ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్‌ కుంభకోణం నేపథ్యంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్‌ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్‌ చేస్తామని, మ్యాచ్‌ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …

Read More »

పెళ్లి కోసం క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన.. కోహ్లీ….. అనుష్క

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని క్రికెట్‌, సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇరువురికి చెందిన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన …

Read More »

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భారత్ జట్టులోకి

భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్‌ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్‌ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి …

Read More »

శ్రీశాంత్ సంచలన నిర్ణయం… వేరే దేశం తరఫున ఆడటానికి.. సై

బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న …

Read More »

ప్రాక్టీస్‌లో స్మిత్‌కు గాయం.. టీ20 సిరీస్‌కు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్‌ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్‌ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి …

Read More »

కోహ్లీని కలిసిన ఈ అమ్మాయిలు ఎవరు…?

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్‌-ఆసీస్‌ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్‌, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్‌, వేల్స్‌లో జరిగిన …

Read More »

ఇండియ‌న్ క్రికెట్ తూఫాన్‌.. పాండ్యా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కపిల్ దేవ్‌..!

ఇండియాలో క్రికెట్ పుట్టిన‌ప్ప‌టి నుండి గ‌మ‌నిస్తే.. అస‌లు భార‌తీయ క్రికెట్‌ చరిత్రలోనే ఇప్పటి దాకా బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరనే ప్రశ్న వస్తే.. క్రికెట్ విశ్లేషకులు ఓ క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కపిల్ దేవ్. అద్భుతమైన పేసర్‌గా.. బ్యాట్స్‌మ్యాన్‌ గా కపిల్ దేవ్ టీం ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1983లో టీం ఇండియా తొలి వరల్డ్‌కప్‌ గెలుచుకుంది కూడా ఆయన సారధ్యంలోనే. ఆయన రిటైర్ అయిన …

Read More »

ప్లేయర్స్‌ను అప్పటికప్పుడు గ్రౌండ్ నుంచి పంపించేయవచ్చు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాట్ కొలతలు, దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్‌ను బయటకు పంపించేయడంతోపాటు డెసిషన్ రీవ్యూ సిస్టమ్‌లోనూ కీలక మార్పులు చేసింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ సిరీస్‌ల నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేస్తారు. ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్‌కు మార్పులు చేయడంతో ఐసీసీ ప్లేయింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat