టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.
Read More »Cricket బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలి- రవిశాస్త్రి
పన్ను పరంగా చూస్తే బెట్టింగ్.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని, భారతదేశంలో బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో బెట్టింగ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే అని రవిశాస్త్రి చెప్పాడు.
Read More »ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్ను
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్నేశాడు. సౌతాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 22 ఇన్నింగ్స్లో 624 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో కోహ్లి 10 ఇన్నింగ్స్లో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాలో సచిన్ 1161 పరుగులతో టాప్లో …
Read More »యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …
Read More »‘అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది
ఒకప్పటి Team India బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సహృదయతను మరోసారి చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్ పోలీసును వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవల సచిన్ ఫ్రెండ్ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చాడు. దాంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. …
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »వన్డే కెప్టెన్సీ మార్పుపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More »వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.
Read More »TEST క్రికెట్ కు టీమిండియా స్టార్ ఆటగాడు గుడ్ బై
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డేలు, T20ల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఈ 33 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకునేందుకు మరో 6 నెలలు పట్టవచ్చని సమాచారం. గాయంతో కోలుకున్నాక కూడా టెస్టులు ఆడేది …
Read More »పాకిస్తాన్ ఘనవిజయం
వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …
Read More »