టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం
పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో …
Read More »76 పరుగుల తేడాతో భారత్ ఓటమి
లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్‌లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో …
Read More »భారత జట్టులో కరోనా కలకలం
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సోకి కృనాల్ పాండ్యా ఇప్పటికే ఐసోలేషన్లో ఉండగా.. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు కృనాల్తో సన్నిహితంగా ఉన్న హార్దిక్ పాండ్యా, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్ ప్రస్తుతం శ్రీలంకలోనే ఐసోలేషన్లో ఉన్నారు.
Read More »ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. సంజు శాంసన్‌తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం …
Read More »42 బంతుల్లోనే సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్
లియామ్ లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజయం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు 31 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిరణంలా కనిపించాడు. భారీ షాట్లతో అతను హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఇది కొత్త రికార్డు. …
Read More »బాబర్ ఆజం రికార్డుల మోత
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.
Read More »టీమ్ ఇండియాలో కరోనా కలకలం
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియన్ టీమ్‌లో కలకలం రేగింది. 23 మంది క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత 20 రోజుల బ్రేక్ దొరకడంతో ఈ గ్యాప్‌లో ప్లేయర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. అప్పుడే సదరు ప్లేయర్ కొవిడ్ బారిన పడ్డాడు. గురువారం టీమంతా డర్హమ్ వెళ్లనుండగా.. ఆ ప్లేయర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్లడం లేదు. యూకేలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, …
Read More »రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. సోమర్సెట్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.
Read More »అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే
అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే 1.విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ.208.56కోట్లు 2. MS ధోనీ రూ.108.28కోట్లు 3. రోహిత్ శర్మ రూ.74.49కోట్లు 4. బెన్ స్టోక్స్ రూ.60కోట్లు 5. హార్దిక్ పాండ్యా రూ.59.9కోట్లు 6. స్టీవ్ స్మిత్ రూ.55.86కోట్లు 7. బుమ్రా రూ. 31.65కోట్లు 8. డివిలియర్స్ రూ.22.50కోట్లు 9. కమిన్స్ రూ.22.40కోట్లు. 10.సురేశ్ రైనా రూ.22.24కోట్లు
Read More »