ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్ కార్యాచరణపై స్పందించాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్తో సంబంధమున్న వ్యవహారాల్లోనే కొనసాగుతానని తెలిపాడు. అయితే కామెంటేటర్గా మారడమా.. మెంటార్గా వ్యవహరించడమా అనేది త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కాగా, 2016లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భజ్జీకి తరువాత జట్టులో చోటు దక్కలేదు.
Read More »టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)
బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read More »టెస్టు క్రికెట్ కి ధనుష్క గుణతిలక వీడ్కోలు
శ్రీలంక కు చెందిన క్రికెటర్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు మొత్తం 8 టెస్టులు 8 ఆడిన అతడు.. 299 రన్స్ చేశాడు. వన్డేలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల గుణతిలక వెల్లడించాడు. అయితే గుణతిలకతోపాటు మరో ఇద్దరిపై శ్రీలంక బోర్డు విధించిన ఏడాది నిషేధం ఎత్తివేసిన రోజే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇటీవలే భానుక రాజపక్సె …
Read More »విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.
Read More »రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం
దక్షిణాఫ్రికతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.సౌతాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది.సౌతాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మెన్ ఎల్గర్ 97పరుగులు(నాటౌట్)ను సాధించి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 202,సెకండ్ ఇన్నింగ్స్ 266పరుగులకు ఆలౌట్ అయింది.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 229పరుగులకు ఆలౌట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో మూడు …
Read More »నాలుగో టెస్టు తొలిరోజు వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 126 పరుగులు
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. వార్నర్ 30, హారిస్ 38, లబుషేన్ 28 రన్స్ చేసి ఔట్ కాగా.. స్మిత్ 6నాటౌట్, ఖవాజా 4నాటౌట్తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్, వుడ్ తలో వికెట్ తీశారు.
Read More »కుప్పకూలిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
Read More »రికార్డుకు చేరువలో కోహ్లీ
టీమిండియా పరుగుల యంత్రం…విరాట్ కోహ్లి ఇప్పటికి 98 టెస్టులు ఆడాడు. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆ దేశంలో మూడో టెస్టు ఆడితే 99 మ్యాచ్ లు పూర్తవుతాయి. స్వదేశంలో శ్రీలంకతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్లో కోహ్లికి వంద మ్యాచ్ లు పూర్తవుతాయి. అదే స్టేడియంలో 360 డిగ్రీస్ ఆటగాడు డివిలియర్స్ కూడా వందో టెస్టు ఆడాడు. ఇద్దరూ కూడా IPLలో బెంగళూరుకే …
Read More »జొహానెస్ బర్గ్ లో టీమిండియాకు మంచి రికార్డు
ఇటీవల జరిగిన సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచు గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో కోహ్లి సేన రెండో టెస్టులో సౌతాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమ్ ఇండియాకు మంచి రికార్డున్న జొహానెస్ బర్గ్ వేదికగా మ్యాచ్ మ.1.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా.. దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రోటీస్ చూస్తోంది. అయితే.. ఈ మ్యాచిక్కి వర్షం వల్ల …
Read More »వైస్ కెప్టెన్ గా బుమ్రా
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని అస్సలు ఊహించలేదని భారత మాజీ సెలెక్టర్, వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నాడు. ‘ఈ విషయం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను. అతడు మల్టీ ఫార్మాట్ ప్లేయర్. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్కి కెప్టెన్సీపై అవగాహన ఉంది’ అని కరీమ్ …
Read More »