ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు. అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా …
Read More »నికోలస్ పూరన్ విధ్వంసం
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న తాప్సీ
బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …
Read More »మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
శ్రీలంకతో నేటి నుండి జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 8,000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగులే అవసరం. తొలి టెస్టుతో కోహ్లి తన కెరీర్లో వందో టెస్టు ఆడనుండగా.. ఈ మ్యాచ్లోనే కింగ్ కోహ్లి ఆ అరుదైన ఘనత సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో …
Read More »మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి
తన కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకో 38 రన్స్ చేస్తే టెస్ట్ రివేల రన్స్ పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ఇంతకుముందు సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. అంతేకాదు 100 టెస్ట్లు ఆడిన 12వ భారత ఆటగాడిగా …
Read More »ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.
Read More »విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి క్రికెట్ పట్ల అంకితభావానికి, హార్డ్ వర్క్ కు నిదర్శనమే వందో టెస్టు అని టీమిండియా పేసర్ బుమ్రా అన్నాడు. జట్టు కోసం అతను ఎన్నో త్యాగాలు చేశాడని కొనియాడాడు. వందో టెస్టులో భారత జట్టును గెలిపించడమే తాము కోహ్లికిచ్చే పెద్ద బహుమతి అని తెలిపాడు. అతను భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణిస్తాడని పేర్కొన్నాడు. ఇప్పటికి కోహ్లి 99 టెస్టుల్లో 7,962 పరుగులు చేశాడు. …
Read More »రోహిత్ శర్మ ట్విట్టర్ లో ట్వీట్లు కలకలం
రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు రావడం కలకలం రేపింది. ఈ ఉదయం రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి “నాకు కాయిన్స్ ను ఎగరవేయడం అంటే ఇష్టం… అది నా కడుపులోకి చేరుకుంటే ఇంకా బాగుంటుంది” అని ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ తో ఫాలోవర్స్ షాక్ తిన్నారు. కాసేపటికే “క్రికెట్ బాల్స్ ను తినొచ్చు కదా?” అంటూ మరో ట్వీట్ రావడంతో రోహిత్ …
Read More »రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా
శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.
Read More »చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.
Read More »