తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని …
Read More »కరోనాతో ఎమ్మెల్యే మృతి
కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్… ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో …
Read More »సీపీఎం మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధిరలో సీపీఎం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ విధానాలు నాయకుల తీరు నచ్చక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Read More »సీపీఐ సీనియర్ నేత మృతి
సీపీఐ సీనియర్ నాయకులు, ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.నారాయణ (81) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎం.నారాయణ మృతి పట్ల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ …
Read More »మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »పొత్తులు లేకుండా ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదా..?
యూటర్న్‌ల చంద్రబాబు మరో బిగ్ యూటర్న్‌కు సిద్ధమవుతున్నాడు..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ పదేళ్ల తర్వాత పాత మిత్రులతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలు చంద్రబాబు ఏ ఎన్నికలైనా సరే పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడు..గతంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాడు. 1999లో ఎన్డీయేతో పొత్తు …
Read More »సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …
Read More »హుజూర్‌నగర్ ఎన్నిక…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం పార్టీ డైలామాలో పడింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై …
Read More »5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »