తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …
Read More »భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి
కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …
Read More »ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …
Read More »తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ
చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయనను మరోసారి ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఎన్నికైన వీరభద్రం.. 2018లో రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ కేడర్ వీరభద్రంపైనే నమ్మకం ఉంచింది. కాగా, మంగళవారం జరిగిన సభలో …
Read More »మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి చెందారు. గత నెల బెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికే పరిమితమైన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 ఏళ్లు బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్లు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం …
Read More »మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత
ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More »