ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.
Read More »