దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,720 కొత్త కేసులు బయటపడ్డాయి. …
Read More »దేశంలో తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 10 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226 కి చేరింది.
Read More »దేశంలో కొత్తగా 10,093 మందికి కరోనా వైరస్
దేశంలో గత నెల రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ బారిన పడగా, 23 మంది మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,48,18,115కు చేరింది. ఇందులో 57,542 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,114 మంది మరణించారు. మరో 4,42,29,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు …
Read More »వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!
చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …
Read More »మంత్రి ఎర్రబెల్లి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్ …
Read More »తెలంగాణలో 324కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు
తెలంగాణ వ్యాప్తంగా 324 కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ప్రతి సెంటర్లో 50 మంది వ్యాక్సిన్ వేసుకోనున్నారు. టీకా తీసుకొనే వైద్య సిబ్బంది వివరాలు ఇప్పటికే కొవిన్ సాఫ్ట్ వేర్ లో నమోదైయ్యాయి..
Read More »