ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.
Read More »పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిన్న మొన్నటి వరకు ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా పత్తి అమ్మకాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. ఒక్క మన రాష్ట్రం నుంచే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏకంగా 1.78 కోట్ల క్వింటాళ్ల (178.55 లక్షల క్వింటాళ్లు) పత్తిని కొనుగోలు చేయటం గమనార్హం. దేశంలో ఇదే అత్యధికమని సీసీఐ ప్రకటించింది. …
Read More »దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ
దేశంలో 2020-21 సం.లో పత్తి సాగులో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 104. 40 లక్షల ఎకరాల్లో సాగుతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 59.63 లక్షల ఎకరాల్లో సాగుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 4% సాగు పెరిగింది. రాష్ట్రంలో నల్గొండ, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, సంగారెడ్డి ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగు అవుతోందని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పేర్కొంది.
Read More »తెలంగాణలో పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్‌శాఖ పరిశీలిస్తున్నది. మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి సాగు
తెలంగాణలో నియంత్రి త పంటల సాగులో భాగంగా పత్తి పంట లక్ష్యా న్ని చేరుకున్నది. బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 60.03 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. నియంత్రిత సాగులో భాగంగా పత్తి పంటను 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పత్తి సాగుకావడం విశేషం. వరిసాగు 52 లక్షల ఎకరాలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ …
Read More »