భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గాంధీజీ 75వ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. జాతిపిత సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీ ఆశయాలను ఆచరిద్దామని, శాంతి, మత …
Read More »ప్రజల బతుకులు మారాలి
దేశంలో ఆయా ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు మహాత్ముడు అందరికీ గుర్తుటారన్నారు. శాంతి, సామరస్యంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అంతటి మహానీయుడు హత్యకు గురికావడం దేశానికి దురదృష్టకరమన్నారు. …
Read More »ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం …
Read More »స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …
Read More »ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో …
Read More »సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా …
Read More »బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ …
Read More »రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More »బాసర ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు …
Read More »