కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »తారకరత్న మృతి-బాలకృష్ణ కీలక నిర్ణయం
నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అనుక్షణం వెన్నంటే ఉండి పర్య వేక్షించిన బాలకృష్ణ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
Read More »బాబు,విజయసాయిరెడ్డి కలయికపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …
Read More »తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …
Read More »గుండె పోటుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
Read More »komatireddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత
komatireddy: నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని……ఇక్కడకు రావడానికి 3 గంటలకు పైగా సమయం పట్టిందని భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే అక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు…..భారాస కార్యకర్తలకు …
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్
ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
Read More »తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్…
వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ …
Read More »త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …
Read More »