కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..
Read More »రాజ్యసభ బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్.డి.దేవెగౌడ జూన్ 19న జరగున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి నేడు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకుల కోరిక మేరకు ఆయన పోటీకి అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 34 మంది జేడీఎస్ …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2000-2004 మధ్య వాజ్‌పేయ్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్ చరణ్ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్ చరణ్ సేథీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు …
Read More »యడ్డీ రికార్డును బద్దలు కొట్టిన చౌహాన్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుదైన రికార్డును సంపాందించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఇరవై ఐదు రోజుల పాటు మంత్రి వర్గం ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుగాంచారు. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప పేరు మీద ఈ రికార్డు ఉంది.యడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే వీరిద్దరూ ఫిరాయింపులదారుల సహాకారంతోనే …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. జమాల్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలాకు గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన రక్త నమూనాలను ఇటీవలే వైద్యులు సేకరించి ల్యాబ్‌కు పంపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే కంటే ముందు.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు …
Read More »కేంద్ర మాజీ మంత్రి మృతి
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంవీ రాజశేఖరన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న రాజశేఖరన్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సారధ్యంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రిగా పనిచేసిన రాజశేఖరన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరన్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలిపారు. …
Read More »సీఎం పదవీకి కమల్ నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి కమల్ నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జి టాండన్ ను రాజ్ భవన్ లో కలవనున్నారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను కమల్ నాథ్ సమర్పించనున్నారు. అసెంబ్లీలో బపలరీక్షకు ముందే కమల్ నాథ్ తన సీఎం పదవీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ” కేవలం పదిహేను నెలల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను. …
Read More »కమల్ నాథ్ ను కాపాడిన కరోనా వైరస్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. ఇప్పటికే ఆరువేలకు పైగా మంది కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడితే కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు ముచ్చట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పార్టీ ఫిరాయించిన సంగతి విదితమే. ఇందులో పద్దెనిమిది మంది రాజీనామాలు చేశారు. అయితే ఈ …
Read More »తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …
Read More »రేవంత్ పై టీఆర్ఎస్ ఎంపీ పిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి వ్యవహారం లోక్ సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పందిస్తూ “చట్టబద్దంగానేపోలీసులు కేసు పెట్టారు. అందుకే రేవంత్ ను అరెస్టు చేశారని టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. …
Read More »