తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్.వసంతకుమార్ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »రేవంత్ రెడ్డి సవాల్
కీసర తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్ లభించడంపై …
Read More »మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, …
Read More »టీపీసీసీ పీఠానికి నేను అర్హుడను..
టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే సీనియర్ నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటానని, అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తానని పేర్కొన్నారు. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు ఎవరైనా తన …
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా
ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్ సచివాలయ …
Read More »ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
Read More »ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ
పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …
Read More »సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం
కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలువడంపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌చేశారు. ‘కర్నల్ సంతోష్‌బాబు సతీమణి గ్రూప్-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్‌బాబు మరణంతో తల్లడిల్లుతున్న …
Read More »