ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …
Read More »దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?
యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.
Read More »ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?
ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.
Read More »బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More »