తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్ అన్సర్’ హ్యాష్‌ట్యాగ్ నంబర్ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు …
Read More »రేవంత్.. ఎవర్ని కొడతావ్? నువ్వేమనుకుంటున్నావ్?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్‌సిన్హాను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ …
Read More »శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి బంపర్ ఆఫర్
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందనుకున్న దానికి సంబంధించిన మరికొన్ని రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. గువహటిలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాలని తనకూ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడని చెబుతూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మవిశ్వాసంతో విచారణకు హాజరయ్యానని రౌత్ …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్
రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …
Read More »నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …
Read More »నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా
దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …
Read More »మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్
మహరాష్ట్రంలో బలపరీక్ష ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే నిన్న రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …
Read More »మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?
మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …
Read More »ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »