చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా …
Read More »‘ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ …
Read More »తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ
భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ …
Read More »స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలి
అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …
Read More »కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »MLA కాకుండానే 8వ సారి సీఎం అవుతున్న నితీశ్ కుమార్
బిహార్ రాష్ట్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?
తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్ చరాస్తుల …
Read More »ప్రియాంకా గాంధీ వాద్రాకు కరోనా
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గత జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.అయితే తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో ఉన్నట్లు ఆమె బుధవారం ట్వీట్ చేశారు. తన సోదరుడైన రాహుల్ గాంధీ కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ …
Read More »నితీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సెటైర్లు
బీహార్ లో బీజేపీకి ప్రస్తుత తాజా సీఎం , జేడీయూ నేత నితీశ్‌కుమార్ ఎన్డీయే కూటమి గుడ్‌బై చెప్పడంతో బిహార్ రాష్ట్రంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నితీశ్‌కుమార్‌పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ …
Read More »