దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు …
Read More »ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందింది. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జి. …
Read More »సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక ఇది: ఎంపీ సంతోష్
కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఇది సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ మియావాకి …
Read More »జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …
Read More »కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ …
Read More »నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై …
Read More »కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం..మంత్రి జగదీశ్‌రెడ్డి
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని మూసీ ప్రాజెక్టు డీ-5 కాల్వ వద్ద సుమారు రూ.10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలుచోట్ల అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో …
Read More »సీఎం కేసీఆర్ హర్షం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని …
Read More »27వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌కు ఇవాంకా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్‌కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »