తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు …
Read More »ఈనెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 25న యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన అనుబంధ శివాలయ ఉద్ఘాటనపర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి 25 వరకు కొనసాగనుంది. అటు యాదాద్రి ఆలయంలో ఇతర నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు
Read More »అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది : మంత్రి కేటీఆర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతోందన్నారు. భారతదేశం …
Read More »టీఆర్ఎస్ దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర వెంకటవీరయ్య, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు …
Read More »ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు
తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ పాల్గొని ప్రసంగిస్తూ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే …
Read More »కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు.పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు . 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 …
Read More »దేశ్ కీ నేత సీఎం కేసీఆర్.. వెలువెత్తిన అభిమానం
ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు, దవాఖానల్లో వసతులు, ఆక్సిజన్, మందుల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులపై మంత్రిమండలి చర్చించనున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల …
Read More »తెలంగాణలో Inter ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో Good News
తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. రీవాల్యూ యేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు చెల్లించిన ఫీజు తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి తమ కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా నగదు తీసుకోవచ్చని తెలిపింది.
Read More »