తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని …
Read More »నేడు ఢిల్లీకి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో …
Read More »సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత …
Read More »ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు-మంత్రి తలసాని
పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ …
Read More »కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో …
Read More »పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల …
Read More »తార్నాకలో టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలోని ఓ బిల్డింగ్‌లో తాత్కాలిక నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి …
Read More »పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్‌లో డేటా సైన్స్ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల …
Read More »