మారుమూల తాండలలో గులాబి జెండా రెప రెప లాడుతోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు గూడెం గుడిసెలలో ఉండే వారిని టి ఆర్ యస్ అక్కున చేర్చేలా చేస్తున్నాయి.దేశానికే తలమానికంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అభివృద్ధి నమూనా పై జరుగుతున్న చర్చ ఇప్పుడు తాండాలలకి పాకింది. ఈ క్రమంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలా నిమిత్తం తాండాలలకి చేరుతున్న నాయకుల సమక్షంలో టి ఆర్ యస్ లో చేరేందుకు …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు …
Read More »లండన్‌లో ఆటో మొబైల్ ఇండస్ట్రీ లీడర్స్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు …
Read More »తెలంగాణలో మద్యం ధరలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంచింది. అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More »మహిళా సంఘాలకు 18 వేల కోట్ల రుణాలు
మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల …
Read More »తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్
తడిచిన వరిధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… రైతులకు భరోసానిచ్చారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని… …
Read More »పద్మ శ్రీ తిమ్మక్కను ఘనంగా సత్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రముఖ పర్యావరణవేత్త,వృక్షమాత, ప్రకృతి పరిరక్షకులు, పద్మ శ్రీ తిమ్మక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క(110) ఇవాళ బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశానికి తిమ్మక్కను కేసీఆర్ స్వయంగా తీసుకెళ్లారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులకు తిమ్మక్కను కేసీఆర్ పరిచయం చేశారు.
Read More »వనజీవి రామయ్య ఆరోగ్యంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా
పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్న రామయ్య రోడ్డు దాటుతుండగా …
Read More »యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్- మంత్ర్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్ …
Read More »దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబివ్వండి..?- బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ కవిత సవాల్
ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని ఆమె సవాల్ చేశారు. ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చే …
Read More »