బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
Read More »70 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం
కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 70 అడుగులు దాటి పోయింది. నదీ ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద …
Read More »గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఏరియల్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో గత వారంతం భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలతో కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు …
Read More »నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని …
Read More »భద్రాచలం కు హెలికాప్టర్ పంపండి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ …
Read More »విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదు : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండపోతగా …
Read More »తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, …
Read More »తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం
మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్ర్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మేడే రాజీవ్ సాగర్ ను మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు.హైదరాబాద్‌లో 516, …
Read More »