తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు బొమ్మలరామారం మండలం వాలు తండా లో దశాబ్ది ఉత్సవాలు – గిరిజనోత్సవము సందర్భంగా నూతన గ్రామపంచాయతీ భవన పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, స్థానిక ఎంపీపీ శ్రీ చిమ్ముల సుధీర్ రెడ్డి గారు, …
Read More »ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ. 3000 కోట్లు జమ
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.మూడు వేల కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు రైతుల నుంచి రూ.13,264 కోట్ల విలువైన ధాన్యం కోనుగోలు చేయగా వారి ఖాతాల్లో మొత్తంగా రూ.9,168 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ నెల 20 లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు 11 లక్షల …
Read More »పట్టణానికో స్వచ్ఛ బడి
తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ్ఛ బడిని రూ.71 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటు మినీ స్టేడియం, వృద్ధ్దాశ్రమం కూడా ఏర్పాటు చేస్తామని, మూసీనది పనులను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని శుక్రవారం హైదరాబాద్ …
Read More »మున్సిపాలిటీల్లోనూ వార్డు కార్యాలయాలు
నెల వ్యవధిలోనే విజయవంతంగా హైదరాబాద్‌లో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్‌ఎంసీ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నదని మంత్రి కేటీఆర్ అభినందించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. వార్డు కార్యాలయాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ర్టాలవారు వస్తారని చెప్పారు. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉడటం గర్వకారణమని చెప్పారు. ప్రతి నెలా మౌలిక వసతుల …
Read More »కుమురం భీం, కుమురం సూరులకు జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి నివాళులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం సందర్భంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఆదివాసీ గిరిజన పోరాట వీరులు కుమురం భీం, కుమురం సూరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మీ . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ, బీఆర్ఎస్ మాండలాధ్యక్షుడు ఉత్తమ్, బీఆర్ఎస్ నాయకులు యూనిస్, రాజయ్య, …
Read More »ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…?
ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…అది తెలువకుండా దాని గురించి మాట్లాడితే చదువుకున్నోళ్లు మాత్రమే కాదు కంప్యూటర్ పై సరయిన పరిజ్ఞానం లేని వారు కూడా నవ్వుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. అది తెలియాలి అంటే కనీస పరిజ్ఞానం ఉండాలి అని ఆయన దెప్పి పొడిచారు. పట్టణ ప్రగతి లో బాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి …
Read More »నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారితో …
Read More »జీహెచ్ఎంసీ లో సరికొత్త మార్పుకు నాంది
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో …
Read More »క్రీడాకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో …
Read More »నెరడిగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలకు, గూడలకు గ్రామాల్లోకి వెళ్ళడానికి సరిగా రోడ్లు కూడా ఉండక ఆరోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడే రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చిరకాల వాంఛలు అయిన రోడ్లు నిర్మించుకోవడంలో భాగంగా ఈరోజు నెరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి మరియు శంకరపూర్ గ్రామానికి మరియు లింగట్ల గ్రామాలకి 2 కోట్ల 43 లక్షలతో ఐటిడిఎ ద్వారా అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు …
Read More »