వైయస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి సత్యారావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విశాఖ జిల్లాకు, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరనిలోటు అన్నారు.విశాఖపట్నం బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. వాకింగ్ చేస్తునపుడు వెనుకనుంచి బైక్ …
Read More »10వ తరగతి పరీక్షల్లో ఇకపై మాస్ కాపీయింగ్ కుదరదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాష్ట్ర రాష్ట్ర ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించిన అంశం విద్యార్థులు చదువు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టారు. విద్యతోనే వారి జీవితాల్లో పేదల బతుకుల్లో మార్పు వస్తుందని అదే అభివృద్ధి అంటూ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మ ఒడి, పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ పథకాలకు శ్రీకారం …
Read More »208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆకట్టుకున్న సీఎం జగన్ ప్రసంగం
ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అన్నారు. 208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును …
Read More »రెండో సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు …
Read More »కర్నూలు జిల్లాలో వర్షాల సమయంలోనూ సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై శ్రద్ధలేదా.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.?
తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో …
Read More »ఆ చానల్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా.? అసలు నిర్ణయం తీసుకున్నదెవరు..
తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా …
Read More »ఇంతవరకూ దుష్ప్రచారం చేసారు.. పర్లేదు.. ఇకనుంచి బాధ్యతగా ఉండండి.. ABN టీవీ బ్యాన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం వరకూ తాను మాట్లాడనని కానీ ఇకపై ఏ ఛానెల్ కానీ, ఏ పత్రిక కానీ.. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పుడే మీడియాపై జగన్ ఉక్కుపాదం తప్పదంటూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా నిషేధం విధించకపోయినా ఏబీఎన్ ఛానెల్ …
Read More »చిక్కుల్లో క్వీన్
తమిళనాడు మాజీ సీఎం,దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ వస్తున్న సంగతి కోలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెల్సిన విషయమే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిన్ని తెరకెక్కిస్తున్నాడు. అలనాటి అందాల రాక్షసి,ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి క్వీన్ అనే పేరు పెట్టారు చిత్రం యూనిట్. అయితే ప్రస్తుతం ఇది చిక్కుల్లో పడింది. జయలలిత మేనల్లుడు దీపక్ ఈ …
Read More »సచివాలయాల ద్వారా 72 గంటల్లోగా అందే సర్వీసులు 115.. 1902 కాల్ సెంటర్ ప్రారంభం..
గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 2న సచివాలయాల ప్రారంభానికి సన్నాహాలపై సీఎం సమీక్షించారు. నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేయగలిగామన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్‌లలో ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నామన్నారు అధికారులు.. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై స్థానికంగా …
Read More »దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి బుల్లెట్ స్పీడ్ తో పరుగులెత్తి ఐదేండ్లల్లోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గత ఏడేండ్లల్లోనే 126% పెరిగింది. …
Read More »