అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం, ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్ సైట్ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా …
Read More »కార్మికుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి నాయిని
దేశంలోనే కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలిచిందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన జాతీయ సమావేశంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, …
Read More »కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం శక్తిమంతం..త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ దేవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగం అత్యంత శక్తిమంతమైనదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ పేర్కొన్నారు. ఈ యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ అధికారంలో ఉంటారని చెప్పారు. తాను కూడా త్రిపురలో అయుత చండీయాగం చేయనున్నట్టు తెలిపారు. బీసీ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు త్రిపుర పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న మంగళవారం త్రిపు ర సచివాలయంలో బిప్లవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ …
Read More »ఫలించిన కేసీఆర్ ఆలోచన..కేటీఆర్ కార్యాచరణ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్థ కార్యాచరణ వల్ల తెలంగాణ రాష్ట్రం ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే నంబర్ 2 హెలీకాప్టర్ కంపెనీ తమ కార్యకలాపాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్‌ను స్థాపించేందుకు …
Read More »మే 10 నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ..సీఎం కేసీఆర్
రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా …
Read More »పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!
బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …
Read More »కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్‌ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …
Read More »తమ రాష్ర్టానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆ సీఎం ఆహ్వానం
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌కు ఊహించని మద్దతు దక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధినాయకురాలు, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగి కూడా …
Read More »వెయ్యి కోట్లతో పాతబస్తీలో మౌలిక సదుపాయాలు..సీఎం కేసీఆర్
హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, కొద్ది రోజుల్లో తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేని, మురికి నీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. …
Read More »దేశం ఒక బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది
130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను …
Read More »