Home / Tag Archives: CM KCR (page 13)

Tag Archives: CM KCR

ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఎక్కడంటే..!

కొవిడ్‌ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 27న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి మంత్రులు, …

Read More »

అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌  చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్‌ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్‌ పాలన

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా స్పీకర్‌ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతులు ఇస్తోంది. తొలి విడతలో 30,453 పోస్టులకు పర్మిషన్‌ ఇచ్చిన ఆర్థికశాఖ.. ఈరోజు మరో 3,334 పోస్టుల భర్తీకి అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టులు అగ్నిమాపక, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, అటవీ శాఖల్లోని ఖాళీలకు సంబంధించినవి. మిగతా శాఖల్లోని …

Read More »

యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …

Read More »

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టి-క్యాబినేట్ భేటీ..తీసుకునే నిర్ణయాలు ఇవేనా…?

  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. నిన్న సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదిక రైతు ధర్నాను నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వడ్లను కొనే అంశం గురించి నిర్ణయాన్ని చెప్పాలని …

Read More »

ఐటీ రంగంలో తెలంగాణ జోరు

ఐటీ రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతోంది. 2021-22లో హైదరాబాద్ నుంచి రూ.1.67 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.1.45 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2026 నాటికి రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించి, 10 లక్షల మందికి IT రంగంలో ఉద్యోగాలు …

Read More »

డ్రగ్స్‌ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్‌

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్‌ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …

Read More »

‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్‌ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్‌ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కూడా గవర్నర్‌ కామెంట్స్‌పై రెస్పాండ్‌ అయ్యారు. గవర్నర్‌ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా …

Read More »

యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధి: ఆనందసాయి

యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్‌ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat