వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు. అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి …
Read More »స్కూళ్లలో బోధనకు స్మార్ట్ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ …
Read More »ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. …
Read More »అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్ ట్వీట్
రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »వైఎస్సార్ ఫ్యామిలీ.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు. ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో …
Read More »వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్’ ‘జై …
Read More »