ఏపీ సీఎం జగన్ ఇవాళ మరో చారిత్రక పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మఒడి పథకాన్ని సీఎ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించారు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం …
Read More »రైతుల ముసుగులో టీడీపీ నేతల అరాచకం..సీఎం జగన్ ఫ్లెక్సీకి అవమానం..!
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రెండు కమిటీలు మూడు రాజధానులకు సానుకూలంగా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో …
Read More »మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …
Read More »మూడు రాజధానులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు ఉంటాయోమో అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతన్నాయి. తాజాగా ఏపీలో మూడు రాజధానులపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్ . వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న జగన్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. …
Read More »డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..!
మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు …
Read More »సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!
నూతన సంవత్సరం నాడు జగన్ సర్కార్ ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఈ మేరకు ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 న కొత్త సంవత్సర సంబురాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు తాము ఇదే రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బుధవారం …
Read More »సీఎం జగన్‌పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్‌పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …
Read More »అమరావతి రచ్చ…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
అమరావతిలో రైతుల ఆందోళనల మంటలలో.. రాజకీయ చలి కాచుకుంటున్న వేళ.. చంద్రబాబుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు షాక్ ఇచ్చాడు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని..వారి మాటలు వినద్దని గిరి కోరారు. ఐదేళ్లలో రాజధాని …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!
ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …
Read More »మూడు రాజధానులపై ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనకు పీపుల్స్ స్టార్‌గా పేరుగాంచిన నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మద్దతు పలికారు. ఇటీవల ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన నారాయణమూర్తి తాజాగా విశాఖలో పరిపాలనా రాజధానిగా చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరుగుతూ అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ …
Read More »