ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More »అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను
టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …
Read More »ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 26 జిల్లాల ఏర్పాటుపై గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. వీటిలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. …
Read More »టీడీపీకి 160 సీట్లా.. ఈలోపు మేం గాజులు వేసుకుంటామా?: కృష్ణదాస్
జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఏపీ సీఎం కాకపోతే తమ ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. అచ్చెన్నాయుడి మాటలకు భయపడాల్సిన పనిలేదని.. టీడీపీ …
Read More »గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్ వల్లే అది సాధ్యమైంది: జగన్
మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …
Read More »ఏపీ కేబినెట్ రీషఫిల్.. జగన్ నిర్ణయం అదే!
ఏపీ కేబినెట్ రీషఫిల్ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది. ఈనెల 30న కేబినెట్ రీషఫిల్ చేయాలని తొలుత సీఎం జగన్ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో …
Read More »కేంద్రమే అంత క్లియర్‌గా చెప్పినా అధికారం లేదంటే ఎలా?: జగన్
రాజధాని, సీఆర్డీఏ చట్టాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజధాని విషయంలో కేంద్రం చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మూల స్తంభాలని.. రాజ్యాంగం ప్రకారం ఈ మూడూ తమ పరిధులకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాజధానితో …
Read More »మా విధానం మూడు రాజధానులే: అసెంబ్లీలో జగన్
ఏ ప్రభుత్వ విధానాలైనా నచ్చకపోతే ప్రజలే వారిని ఇంటికి పంపిచేస్తారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన నచ్చపోవడంతోనే 175 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని చూసి ప్రజలే తీర్పు ఇస్తారని.. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదేనని చెప్పారు. శాసనసభలో వికేంద్రీకరణపై అంశంపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అసాధ్యమైన టైం లైన్స్‌తో నెలరోజుల్లో రూ.లక్ష …
Read More »ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్
అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …
Read More »