సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మహేశ్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలో ఉపయోగించిన మాటను ఈ మూవీలో చిత్రబృందం వాడింది. మహేశ్ చేత ఆ డైలాగ్ చెప్పించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ‘నేను విన్నాను.. నేను …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సర్వే చేయించారు: కొడాలి నాని
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …
Read More »గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్
మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …
Read More »సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ
సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »హైకోర్టు సీజేతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …
Read More »ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More »అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు వీళ్లే..
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్‌ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు.. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్‌నాథ్ విశాఖ – విడదల రజని అనకాపల్లి – పీడిక …
Read More »