జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …
Read More »అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు
తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో కవిత పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని కవిత అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకుంటున్నామని …
Read More »తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్‌లో తమ నూతన టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించబోతున్నది. గతనెల బ్రిటన్ పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం జరిగిన నేపథ్యంలో 5 వారాల్లోనే పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో డిజిటల్ సేవలను విస్తరించేందుకు గ్రూప్ పెట్టుకున్న 3 బిలియన్ …
Read More »ఆసియాలోనే అతి పెద్దదైన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ …
Read More »దేశానికి దిక్సూచిగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారి అధ్యక్షతన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి రింగ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వరకు కళాకారుల డప్పు దరువులతో, కళాబృందాల నృత్యాలతో, తెలంగాణ …
Read More »ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర …
Read More »భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణ
భారతదేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకం.. జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతామన్నారు. అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ట్వీట్ చేశారు.“అమరుల ఆశయాలే స్ఫూర్తిగా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాం. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి …
Read More »“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. దేశంలోనే అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ సమానంగా గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి …
Read More »తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్
తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది. సూర్యాపేట లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని రాష్ట్ర విద్యుత్ …
Read More »స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు అధిక ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ముస్లిం మత ప్రార్థనలు షాది ఖానాలో, క్రిస్టియన్ మైనార్టీ వారివి చర్చిలో నిర్వహించిన మత ప్రార్థనలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలంగాణ ఆవిర్భావ …
Read More »