ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఏలూరు వెళ్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వరుసగా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటానని, పార్టీ తరుపున మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని కలిసిన అనంతరం …
Read More »నీవు ,నీ పార్టీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో..దేనికెనా రెఢీ’చింతమనేనికి వైసీపీ ఎమ్మెల్యే తండ్రి సవాల్
‘నేను చల్లగొళ్ల సూర్యనారాయణ కొడుకుని. యుద్ధాలు మొదలైంది మాతోనే. పుట్టింది మా ఇంట్లోనే. పెరిగింది మా ఇంట్లోనే. మా బ్లడ్‌లోనే ఉంది. నీకు గానీ, నీ పార్టీకీ గానీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో. దేనికెనా రెఢీ’ అంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తండ్రి రామచంద్రరావు.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. చింతమనేని వ్యాఖ్యలపై పెదవేగి మండలం జానంపేటలో …
Read More »చింతమనేని కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపై..ఎస్పీ ..డీఎస్పీ సీరియస్
దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన …
Read More »చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ఉన్న తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశం..ప్రత్యేక బృందాలు రంగంలోకి
దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం …
Read More »ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారనే భయం తో..పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. !
పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై… ఆయన అనుచరులపై… ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న మట్టి తీసుకెళ్తున్న ఎస్సీలపై… “తాను తప్ప ఎవరూ మట్టి తోలేందుకు వీలు లేదని” అడ్డు చెప్పిన చింతమనేని… ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించిన ఎస్సీలపై దాడి చేసి… కులంపేరుతో అడ్డమైన తిట్లూ తిట్టారని కేసు నమోదైంది. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ …
Read More »మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై జగన్ సిరీయస్..వెంటనే అరెస్ట్ చెయ్యండి
పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మల్యే …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అహంకారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం..!
మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా …
Read More »ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …
Read More »దెందులూరులో తాజా పరిస్థితి.? వివాదాస్పద సెగ్మెంట్ లో పార్టీకోసం అబ్బయ్యచౌదరి ఏం చేస్తున్నాడు.? ఇంకోసారి చింతమనేని గెలిస్తే
పశ్చిమ గోదావరిజిల్లాలో అత్యంత కీలకమైన, వివాదాస్పద నియోజకవర్గం దెందులూరు.. ప్రస్తుతం దెందులూరులో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద. ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి వైఖరి, దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, బూతులు మితిమీరుతు న్నాయని, ఈయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బేరాలాడుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా ఈపరిణామం పార్టీని బజారున పడేస్తోందట. పేదలు,మధ్య తరగతి వర్గాలని కూడా చూడకుండా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార గర్వంతో …
Read More »బూతులు, రాయలేని భాషతో సొంతపార్టీనేతలపైనే రెచ్చిపోయిన ప్రభుత్వ విప్
అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద రీతిలో ప్రవర్తించారు. ఎమ్మెల్యే అన్న పేరే కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. జిల్లాలో తాను చెప్పిందే వేదంగా, తన ఏరియా కాకపోయినా ఎక్కడైనా పంచాయితీ చేస్తూ నిత్యం దూకుడు ప్రదర్శించే చింతమనేని గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడినందుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. అలాగే గతంలో నూజివీడులో కేవలం బస్సు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి …
Read More »