తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ సరస్వతి శనివారం నాడు సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకను సందర్శించారు. స్వామివారికి స్థానిక శివాలయం అర్చకులు, గ్రామసర్పంచ్, ప్రజలు, చిన్నారులు మేళతాళాలతో స్వామివారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజల …
Read More »ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం ఉదయం పదిన్నరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తన సొంతూరు అయిన చింతమడక గ్రామంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో గ్రామానికి చెందిన ప్రజలందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాపంక్తి భోజనాలు చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ”గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ. పది …
Read More »చింతలేని గ్రామంగా చింతమడక
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్ …
Read More »చింతమడకలో సీఎం కేసీఆర్ ఏమి ఏమి చేయనున్నారంటే..!
నేను మళ్లీ వస్తా.. అన్ని విషయాలను మాట్లాడుకుందాం.. మీతో రోజంతా గడుపుతా.. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ చింతమడక గ్రామస్థులతో అన్న మాటలివి. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులు దాని ప్రకారం ప్రతిపాదనలను రూపొందించారు. …
Read More »చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్ అన్నారు.
Read More »