కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …
Read More »చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజెక్షన్ ఎన్ని రూ.కోట్లో తెలుసా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ దంపతుల 23 నెలల చిన్నారికి ఓ అరుదైన వ్యాధి సోకగా దాతల సాయంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఫ్రీగా అందించింది ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నోవార్టిన్ ఫార్మా కార్పొరేట్. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్ చిన్నారికి చికిత్స జరిగింది. రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల నెలల పాపకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ-2(ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధి …
Read More »బాబోయ్.. కేరళలో ‘నోరో వైరస్’ కలకలం..
కేరళలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …
Read More »హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.
Read More »పిల్లలు కూడా కరోనా బారిన పడకుండా ఏమి చేయాలంటే..?
సెకండ్ వేవ్ పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు నిమ్మజాతి పండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు, పెరుగును రోజువారీ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లు పట్టుకుని, నిద్ర పోకుండా ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుందని అందుకే కనీసం 10 గంటల పాటు నిద్రపోయేలా చూడాలంటున్నారు. విటమిన్ డి తగిలేందుకు రోజూ అరగంట సేపు లేలేత ఎండలో ఉంచాలంటున్నారు.
Read More »తల్లుల నుండి పిల్లలకు కరోనా సోకుతుందా..?
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మొత్తం లక్ష ఎనబై ఎనిమిది వేల మందికి కరోనా వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ తల్లుల నుండి కరోనా వైరస్ కడుపులో ఉన్న పిల్లలకు సోకదని చైనాలోని హౌఝాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో తేలింది. కరోనా వైరస్ ప్ర్త్రారంభమైన వూహాన్ లో నలుగురు గర్భిణీలు కోవిడ్ వైరస్ బారీన పడినప్పటికి …
Read More »సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకంపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూపులు
సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత …
Read More »పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య
మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి …
Read More »