తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటివరకూ 1131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అధికారులు వివరించారు.
Read More »