ప్రముఖ సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ యూపీలోని బందా జిల్లా మహిళా జడ్జి సీజేఐకు లేఖ రాశారు. ‘నేను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నా. నన్ను ఓ చెత్తలా చూశారు. అందువల్ల గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి’ అని ఆమె కోరారు. సీజేఐ చంద్రచూడ్ సూచనతో ఆమె లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టుకు లేఖ రాశారు.
Read More »ఇకపై పెళ్లి అయినా లేకున్నా అబార్షన్ చేసుకోవచ్చు!
అబార్షన్‌లపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరకీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారు అంటూ తేడా లేకుండా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ …
Read More »సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు
ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …
Read More »పెగాసస్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ …
Read More »తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు: ఎన్వీ రమణ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన …
Read More »యాదాద్రిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
దేశం అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం …
Read More »