తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు కారును పోలిన గుర్తును కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 3,489 ఓట్లు పడ్డాయి. దీంతో కొంతమంది దుబ్బాక ఓటర్లు పొరపాటుగా అతనికి ఓటు వేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read More »ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-8వ రౌండ్ ముగిసేవరకు..!
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం 200 అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదట ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. ఆరో రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థే వరుసగా ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-6వ రౌండ్‌లో కారు జోరు
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఆరు రౌండ్ల పూర్తయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరు రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే 2,667 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థే కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకూ 45,175 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఆరో రౌండ్ ఫలితాలు ఇలా.. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్
తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్‌దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-4రౌండ్లో బీజేపీ జోరు
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కూడా ముగిసింది. వరుసగా నాలుగు రౌండ్లలోనూ బీజేపీయే తన హవాను కొనసాగిస్తోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాగా దుబ్బాకలో ఇప్పటి వరకూ దుబ్బాకలో 28,074 ఓట్ల లెక్కింపు పూర్తైంది. 2,684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కొనసాగుతున్నారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ముందంజ
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కారు జోరు అప్పుడే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ముందంజలో ఉంది. ఈ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలను తెరిచింది. కొద్దిసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈవీఎంల మొదటి రౌండ్ లెక్కింపు షురూ అయ్యింది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బీజేపీ …
Read More »దుబ్బాకలో 82.61% పోలింగ్ నమోదు
దుబ్బాక ఉపఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 86.24% ఓట్లు పోలవగా.. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక బీహార్ లో 94 స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో 53.51% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తుదివిడత ఎన్నికలు ఈనెల 7న జరగనుండగా.. ఈ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న లెక్కించనున్నారు..
Read More »