కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »మద్యపానం బదులు గంజాయిని అలవాటు చేయాలి-BJP MLA
ప్రస్తుతం చాలా మంది మద్యపానానికి బదులుగా గంజాయి, భాంగ్ ని ప్రోత్సహించాలని ఛత్తీస్ గడ్ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడమే కాకుండా గతంలో దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించానని ఆయన తెలిపారు. గంజాయి తాగినవాళ్లు అత్యాచారం, హత్య, దోపిడీలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. బాధ్య తాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? …
Read More »ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
Read More »మోడీకి ఎన్నికల భయం..తెలంగాణ పథకాలతోనే ఓట్లు అడిగే ఎత్తుగడ
ఇటీవల జరిగిన చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరాజయంతో భారతీయ జనతాపార్టీలో మథనం మొదలైంది. ఈ ఓటమికి రైతుల ఆగ్రహమే కారణమని, లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని సార్వత్రిక అస్త్రంగా ఎక్కుపెట్టింది. ప్రధానమంత్రి రుణమాఫీ ప్రకటించే దాకా నిద్రపోనివ్వను అన్న రాహుల్ గాంధీ ఎటాక్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ …
Read More »