ఏపీ అధికార వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ మహ్మద్ కరీమున్నీసా(65) గుండెపోటుతో చనిపోయారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురికాగా.. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన ఆమెకు ఈ ఏడాది మార్చిలో సీఎం జగన్ ఎమ్మెల్సీగా …
Read More »బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో YSRCP ఘనవిజయం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. …
Read More »ఏపీ మండలి చైర్మన్ గా మోషేను రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గా ప.గో. జిల్లాకు చెందిన గా ఎమ్మెల్సీ మోషేను రాజు ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోషేను రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాజమండ్రి లోకసభ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై క్లారిటీ లేదు.
Read More »బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌ను నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు హాళ్లు, 27 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 12 రౌండ్లలో బద్వేల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగనుంది.బద్వేల్‌లో మొత్తం 2,15,392 ఓట్లకు గాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల ప్రకారం దాదాపు అన్ని టేబుళ్లతో పది రౌండ్లు కౌంటింగ్ …
Read More »చంద్రబాబుపై సజ్జల ఫైర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత,మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మాజీ సీఎం చంద్రబాబు మోసపు వాగ్దానాలు మొదలవుతాయి. ఆయన జిమ్మిక్కుల పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎన్నికల …
Read More »ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?
ఇది చదవడానికి కాస్త విడ్డూరంగా ఉన్న కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను.. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవుననే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా చెపట్టిన సర్వేలో టాప్ టెన్ లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్థానం లభించకపోవడం కూడా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇమేజ్ మసకబారుతుందని చెప్పొచ్చు.. గత సార్వత్రిక ఎన్నికలకు …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.
Read More »TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More »నిరుద్యోగులకు అండగా నారా లోకేష్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.
Read More »బాబుకు షాక్ -టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా …
Read More »