జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …
Read More »సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ …
Read More »రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …
Read More »EWS రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు సోమవారం తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్‌ఎస్‌ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 24,205 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ …
Read More »కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్ అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్/యూటీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో పాల్గొన్న …
Read More »రైల్వే ప్రయాణికులకు బిగ్ షా
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …
Read More »రైల్వే ప్రయాణికులకు షాక్
మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …
Read More »మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్య సేవలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలియజేశారు.ఇందుకోసం 4500 వాహనాలను అందుబాటులోకి …
Read More »అగ్నిపథ్ పై కేంద్రం తాజా నిర్ణయం
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకోచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనం సంగతి విదితమే. కేంద్ర సర్కారు తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, CAPFలలో 10% పోస్టులను అగ్నివీరులతో భర్తీ చేస్తామంది.
Read More »