టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »టీడీపీకి ఎంతో సేవ చేశా.. అయినా నన్ను అవమానించారు: దివ్యవాణి
పార్టీ కోసం ఎంతో చేసినా తనను తీవ్రంగా అవమానించారని సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆమె ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందన్నారు. మహానాడు వేదికగా తనను అవమానించారని ఆరోపించారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో కళాకారులు …
Read More »జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం
సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …
Read More »ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు: జేసీ
అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏం జరిగిందంటే.. ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ …
Read More »పవన్.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్ పాలిటిక్స్?
‘దరువు.కామ్’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్ కట్ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …
Read More »అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..
తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం లేదు. పని ఆగిపోయేందుకు ఎన్ని కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు …
Read More »టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు అస్వస్థత.. పరామర్శించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …
Read More »కృష్ణమ్మకు నీళ్లొచ్చాయి.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి.. అంతా ప్రశాంతంగా ఉన్నారు
ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ …
Read More »చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా.. అమరావతిలో ఉద్రిక్తత.. అఖిలప్రియ, అనిత, అచ్చెన్నాయుడు, నన్నపనేని హల్ చల్
చలో ఆత్మకూరు సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144సెక్షన్ అమల్లో ఉన్నా రాజధాని ప్రాంతంలో హల్‌చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంతో కావాలని విరుచుకుపడుతున్నారు. సాటి మహిళా పోలీసులు అనికూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు వారిపై దూషణలకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధులనుంచి వెళ్లిపోయిన ఘటన జరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసం …
Read More »అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ఎలా పరిపాలన చేసారో యనమల, చంద్రబాబు సమాధానం చెప్పాలి.
అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన ఎలా చేశారో మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్య నారాయణ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో వ్యవస్ధలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడపలేదని బొత్స విమర్శించారు. వ్యవస్ధలను గాడిలో పెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …
Read More »