దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ …
Read More »పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,308 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 19 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277 కు చేరింది. మొత్తంగా 3,125 మంది మృతి చెందారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీ సంఖ్య 5,09,663 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »మహారాష్ట్రలో కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.
Read More »సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »దేశంలో కరోనా కేసులపై ఊరట
దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. వరుసగా 4 రోజులు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,754 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575 నమోదు కాగా 2,46,116 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 14,74,606 కరోనా టెస్టులు …
Read More »కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ
ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ను జయించింది ఓ బామ్మ.. కరోనా మృతుల కేసులో ఎక్కువమంది ఎక్కువ వయస్సువాళ్ళు న్న నేపథ్యంలో ఏకంగా 103ఏళ్లు ఉన్న బామ్మ ఆ వైరస్ బారీ నుండి బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 103ఏళ్ళ బామ్మ కరోనాను జయించింది. వారం రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బామ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్సను అందించారు. …
Read More »