తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,749 కరోనా టెస్టులు చేయగా 767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,81,603కు చేరాయి. ఇప్పటివరకు 4,105 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 2,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »దేశంలో కొత్తగా 67,597 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దేశంలో ప్రస్తుతం 2.35 శాతం కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి …
Read More »GHMCలో కొత్తగా 746 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 746 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 181,299 కరోనా కేసులు నమోదయ్యాయి. 15-18 సంవత్సరాల వయసు గల వారు కొవిడ్ వ్యాక్సిన్, మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్, 60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఫ్రెంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 2,484 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం మొత్తం 65,263మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.61లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తంగా 7.18లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆదివారం కరోనాతో ఒకరు మరణించగా ఇప్పటివరకు 4,086మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 38,723 …
Read More »ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి
ఒమిక్రాన్ కారణంగా పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ICMR అధ్యయనంలో తేలింది. ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతోందని ICMR తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒమిక్రాన్ లక్ష్యంగా రూపొందించుకోవాలని పేర్కొంది.
Read More »వారంలో ఏకంగా 2.1 కోట్ల మందికి కరోనా
ప్రపంచవ్యాప్తంగా గత వారంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. జనవరి 17 నుంచి 23 వరకు ఏకంగా 2.1 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక వారంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని WHO పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు ఊహించనంతగా పెరిగాయని తెలిపింది. ఇదే వారంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది కరోనాతో …
Read More »ఒమిక్రాన్ తగ్గిన కానీ తప్పని ఆందోళన
ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా మందిలో గొంతుకే పరిమితమవడంతో .. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే నయమవుతుందంటున్నారు నిపుణులు.
Read More »కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం
కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్‌కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి …
Read More »కరోనా పై Good News
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం కరోనా ఉధృతి మాత్రం కాస్త స్వల్పంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,55,874 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 20.75శాతం నుంచి 15.52శాతానికి తగ్గింది. 614మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »