తెలంగాణ వ్యాప్తంగా 324 కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ప్రతి సెంటర్లో 50 మంది వ్యాక్సిన్ వేసుకోనున్నారు. టీకా తీసుకొనే వైద్య సిబ్బంది వివరాలు ఇప్పటికే కొవిన్ సాఫ్ట్ వేర్ లో నమోదైయ్యాయి..
Read More »సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …
Read More »తెలంగాణలో కొత్తగా 351 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. …
Read More »అమెరికాలో కరోన విలయతాండవం
అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది. మొత్తం రికవరీలు 2,81,872 మంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »దేశంలో తాజాగా 16వేల కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు, 224 మరణాలు 8,29,964 కరోనా టెస్టులు చేయగా 19,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది. నిన్న 224 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందగా మొత్తం 1,49,218 మంది ప్రాణాలు విడిచారు గత 24 గంటల్లో 22,926 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 99,06,387కు చేరింది. ప్రస్తుతం 2,50,183 …
Read More »తెలంగాణలో 293 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 2,87,108కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,546కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 535 మంది కోలుకోగా మొత్తం 2,79,991 మంది డిశ్చార్జయ్యారు ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,590 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య …
Read More »నాకు కరోనా రావచ్చు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్ వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తనకు వైరస్ పాజిటివ్ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్ ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను …
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 286 మంది చనిపోయారు. 26,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా, కరోనాతో 1.48 లక్షల మంది మృతి చెందారు. కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య …
Read More »