ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »భారత్ లో కరోనా విలయం
ప్రస్తుతం మన దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ …
Read More »దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల …
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం
హైదరాబాద్‌లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.
Read More »కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్
ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్ లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 48.39 శాతం టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. ఢిల్లీ(43.11 శాతం) రెండో స్థానంలో ఉందని ప్రకటించింది అటు దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది అక్కడ ఇప్పటివరకు 57 లక్షల డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది
Read More »షాకింగ్ న్యూస్ -ఏపీలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా
ఏపీలో తూ.గో. జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో 3. ఏకంగా 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగా ఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచిన వైద్యులు… వారికి చికిత్స అందిస్తున్నారు
Read More »తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కు చేరింది. ఇక నిన్న కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,683కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 204 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్ కేసులున్నాయి..
Read More »