దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.
Read More »తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ
తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.
Read More »కరోనా సోకిన వారు ఇవి తినాలి..?
మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …
Read More »కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం
ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.
Read More »దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. …
Read More »దేశంలో కరోనా మహోగ్రరూపం
దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 …
Read More »తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »