తెలంగాణలో కొత్తగా 70,961 మందికి పరీక్షలు జరపగా 6,876కేసులు నమోదయ్యాయి. 59 మంది కరోనా బాధితులు మరణించారు. ఈ మేరకు తెలంగాణ హెల్త్ బులెటిన్ ను ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,432 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »దేశంలో కరోనా ఉద్ధృతి హోరు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది. మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.
Read More »ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే..?
కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్‌బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని …
Read More »దేశంలో కరోనా విళయతాండవం
ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …
Read More »ఇండియాలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం మే 31 వరకు పొడిగింపు
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే …
Read More »తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More »