భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్
కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.
Read More »COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ
■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …
Read More »తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Read More »తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్ కో సంస్థ
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »కరోనా టీకాపై శుభవార్త
ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.
Read More »దేశ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే తరహా సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను వాడుకోవాలన్నారు. సెకండ్ వేవ్ గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీన్ని కట్టడి చేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »చద్దన్నం తింటే ఉంటది
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లను నాశనం చేస్తుంది. చద్దన్నంలో చాలా రకాల పోషకాలుఉంటాయి. 1. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 2. చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3. మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 4. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. 5. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
Read More »