Home / Tag Archives: carona virus (page 80)

Tag Archives: carona virus

వర్కింగ్ హాస్టల్స్ మూసేయద్దు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.

Read More »

ఏపీలో మరో కరోనా కేసు

ఏపీలో మరో కరోనా కేసు నమోదయింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.త్వరలోనే అతడ్ని డిశ్చార్జ్ చేసే అవకాశముంది. అయితే తాజా కేసుతో ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది.

Read More »

మీకు రేషన్ కార్డు ఉందా..?

మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. …

Read More »

కరోనా భయంతో ఆత్మహత్య

ప్రపంచంలో చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో ఈ వైరస్ తనకు సోకిందనే అనుమానంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచితే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టుల్లో అనుమానంగా ఉన్న వ్యక్తిని సప్దర్ జంగ్ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే …

Read More »

ఒక్క రోజే 12 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. అటు బెంగళూరులో రెండు,నోయిడాలో మరో కొత్త కేసు నమోదు అయింది. మొత్తంగా దేశం మొత్తం ఒక్క రోజులోనే పన్నెండు కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ,కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.

Read More »

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి అయిన ఆర్టీసీ బస్సులలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రతి బస్సులోనూ శానిటైజర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో …

Read More »

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. బ్రిటన్ దేశం నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు రీపోర్ట్ వచ్చిందని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే ఐదు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి కోలుకుని గాంధీ ఆస్పత్రి నుండి డిశార్జి అయ్యాడు.

Read More »

మాస్కులు ఎలా ధరించాలో తెలుసా..?

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది * ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి * ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి * ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి * తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు * మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి

Read More »

ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 162దేశాల్లో 1,82,609మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో 7,171మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనా దేశంలో 80,881 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,226మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇటలీలో 27,980కేసులు నమోదైతే 2,158మంది మృతినొందారు. ఇరాన్ లో 14,991 కేసులు నమోదైతే 853మరణాలు చోటు చేసుకున్నాయి.స్పెయిన్ లో 9942 కేసులు నమోదైతే …

Read More »

స్టాక్ మార్కెట్లకు ఊరట

మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat