భూమండలాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడంలోనే ప్రపంచ శాస్తవేత్తలంతా నిమగ్నమయ్యారు. పక్కనున్నవారికి కూడా తెలియకుండాసాగే ప్రక్రియ ‘పరిశోధన’. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా పరిశోధన ఫలితాలను పంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు అంచనా. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాదాపు ఒకే అంశంపై పరిశోధన సాగించడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారికావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ …
Read More »లాక్ డౌన్ ముగుస్తుందా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ …
Read More »తెలంగాణలో కరోనా కట్టడికి రూ.370కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులను తగ్గించిన కానీ ఢిల్లీ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి రూ .370కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పాలనాపరమైన అనునతులు ఇస్తూ ఆదేశాలను సైతం జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.ఆయా శాఖల …
Read More »కరోనా యాప్ ను ప్రారంభించిన కేంద్రం
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా …
Read More »ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి. జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసులు:- నెల్లూరు-32 కృష్ణా-23 గుంటూరు-20 కడప-19 ప్రకాశం-17 పశ్చిమ గోదావరి-15 విశాఖపట్నం-14 తూర్పుగోదావరి-09 చిత్తూరు-09 అనంతపురం-02 కర్నూలు – 01 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ …
Read More »సామాన్యులకు ఊరట
సామాన్యులకు మరో ఊరట నిచ్చే విషయం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐ కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు ఇలా పలు అంశాల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే ఆ జాబితాలో వెహికిల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల గడువును కూడా పొడగించింది ప్రభుత్వం. ఈ నెల 21 …
Read More »కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకంకావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించడంలోనూ పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. మానవాళికి చాలెంజ్ విసిరిన కరోనాను ఓడించడంలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని డీజీపీ పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవడంలో అందరి కృషి, చొరవ.. పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మరింత ఉత్సాహంగా పోలీసులు పనిచేసేలా సహకరించాలని …
Read More »ప్రభాస్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …
Read More »భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి కల్యాణం
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరిగింది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి …
Read More »తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు
మర్కజ్ హౌజ్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్. వారికి ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మర్కజ్ సామూహిక ప్రార్థనల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఆ ప్రార్థనల్లో ఎంతమంది పాల్గొన్నారు. వారి వల్ల ఈ వైరస్ ఎంతమందికి సోకిందని …
Read More »